Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉత్తమ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా ఎంపికైన మంజుల వీణ

విశాలాంధ్ర,పార్వతీపురం/సీతానగరం:పార్వతీపురం మన్యం జిల్లాలో విశిష్ట సేవలు అందించినందుకు  పాచిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, పార్వతీపురంమన్యంజిల్లా డివిఈవో డి. మంజులవీణను ఉత్తమ ప్రిన్సిపల్ గా సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగాసత్కారంచేసి, ప్రశంసాపత్రాన్ని పొందారు.ఇంటర్మీడియట్లో గణితశాస్త్రం జూనియర్ లెక్చరర్ గా1999 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈమె  ఎంపికయ్యారు.శ్రీకాకుళం జిల్లా మందస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొలిసారి జూనియర్ లెక్చరర్ గా విధుల్లో చేరారు. అనంతరం విజయనగరం జిల్లా బాడంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకురాలిగా సేవలందించారు. 2009 సంవత్సరంలో ప్రిన్సిపల్ గా పదోన్నతి పొంది కురుపాo, సాలూరు, పాచిపెంటలలో ప్రిన్సిపాల్ గా పనిచేశారు. గతంలో విజయనగరం జిల్లా ఆర్ ఐ ఓ గా పనిచేశారు.ప్రస్తుతం పార్వతీపురం మన్యంజిల్లా వృత్తివిద్యాశాఖ అధికారిణిగా కొనసాగుతున్నారు.ఈమెకు జిల్లాస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ గా అవార్డు రావడంపట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.జిల్లాకుచెందిన  ప్రిన్సిపాళ్లు వై. నాగేశ్వరరావు,జె.రామారావు, ఎ.రాజు, బొబ్బిలి రేణుక, జిల్లా జూనియర్ లెక్చరర్ల సంఘం కార్యదర్శి తెర్లిరవి కుమార్,పలువురు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
ఇదిలాఉండగా సీతానగరం మండలంలోని ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు చేతుల మీదుగా తీసుకున్నారు. జోగమ్మ పేటప్రతిభా కళాశాల ఇంగ్లీష్ జూనియర్ లెక్చరర్స్ ఈ ఎల్ నాయుడు,నిడగల్లు ఉన్నత పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడు ఆర్ సత్తిరాజు, జగ్గునాయుడుపేట ప్రాధమిక పాఠశాలఉపాధ్యాయులు కంటి రవిచరన్, తామరఖండి అంగాన్వాడి కేంద్రం టీచర్ లక్ష్మిలు ఉత్తమఉపాధ్యాయ సత్కారాలు పొందిన సందర్భంగా మండలంలోని వారంతా వారిని అభినందించారు.

 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img