Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

రహదారి పనులు పరిశీలించిన మన్యంజిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం/పాచిపెంట: విశాఖపట్నంనుంచి రాయపూర్ వైపు వెళ్ళే జాతీయ రహదారి పనులనుపార్వతీపురం మన్యం జిల్లాకలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. విశాఖ పట్నం నుంచి రాయపూర్ వరకు జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులను పాచిపెంటమండలం ఆలూరు, రామభద్రపురంమండలం కొండకింగువ వద్ద మంగళవారం నాడు పరిశీలించారు. హెచ్ జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ చేపడుతున్న ఆలూరు నుంచి జక్కువ వరకు సుమారు 31కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆరువరుసల జాతీయ రహదారి పనుల వివరాలను జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు మ్యాప్ ద్వారా ప్రతిపాదిత రహదారి వివరాలను వివరించారు. ప్రాజెక్ట్ పనులు నిర్వహణలో అటవీ ప్రాంతానికి సంబందించి అటవీశాఖ అనుమతులు, కాలువల నిర్మాణాలకు అవసరమైన  జలవనరుల శాఖ అనుమతులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అవసరం మేరకు సహకారం అందిస్తామని, రహదారి పనులను పరిశీలించిన అయన సంతృప్తి వ్యక్తం చేశారు.జాతీయరహదారుల నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ ఇంచార్జి రాజశేఖర్ మాట్లాడుతూ 12 కిలో మీటర్ల మేర ఇప్పటికే పనులు ప్రారంభించామన్నారు. మిగిలిన మొత్తానికి పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో రహదారి ప్రక్కన వివిధ వసతులు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ మాల పరియోజన క్రింద జాతీయ రహదారి 130 సిడి గా రహదారిని నిర్మించడం జరుగుతోందని ఆయన వివరించారు.ఈకార్యక్రమంలో కన్సల్టింగ్ టీమ్ లీడర్ జి.పి.మద్దిలేటి, తహాశీల్దార్ రాజశేఖర్, ఎంపిడిఓ ఉమామహేశ్వరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img