Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మంచినీటిపథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగారావు

విశాలాంధ్ర,పార్వతీపురం/పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలంలోని నర్సిపురంగ్రామంలో ఎస్సీకాలనీ ప్రజలు త్రాగునీటి సదుపాయంలేక ఎన్నో ఏళ్లుగా ఎంతోఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు 15వఆర్థిక సంఘం నిధులద్వారా రూ.20 లక్షలరూపాయలు అంచనావ్యయంతో అత్యవసరంగా గ్రామంలోగల 90 కేఎల్ వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ వేయించి నేరుగా కాలనీలలోని  7వీధులకు కొలాయిలు ద్వారా త్రాగునీటి పథకాన్ని అందించేకార్యక్రమాన్ని శనివారం ప్రారంభం చేశారు. ఆయన చేతులమీదుగా ప్రజాప్రతినిదులు, నాయకులు, అధికారులు, ప్రజల సమక్షంలో ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించి కులాయిల ద్వారా త్రాగు నీరు విడుదల చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తన దృష్టికి వచ్చిన  అందరి అతిప్రధానసమస్య త్రాగునీటి సమస్యకు పరిష్కారం అనతి కాలంలోనే చేసి చూపడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా నరిసిపురంగ్రామంలోనే శనివారం  గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంద్వారా గ్రామంలో గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇంతవరకు నియోజక వర్గంలో 78రోజులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని గ్రామాల్లో ప్రతీ గడపకు వెల్లి వారికి ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గూర్చి చెబుతూ ఇంకా ఏమీ కావాలని అడుగుతూ ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.ఒక్కో సచివాలయంలో గడప గడపకు కార్యక్రమం ద్వారా గుర్తించిన సమస్యలు పరిష్కారానికి 20లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన చెప్పారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, మండలఅధికారులు, వైసీపీ  నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామప్రజలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img