Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం చేయమని మోడీ ప్రకటించాలి

  • ఏపీ విభజన హామీలు అమలు చెయ్యాలి
  • వామపక్ష నాయకుల డిమాండ్
  • వామపక్షాల అధ్వర్యంలో నల్ల జండా లతో నిరసన ర్యాలీ

శ్రీకాకుళం: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే ఆలోచన విరమించుకుని, అమ్మడం లేదని విశాఖపట్నం సభలో ప్రధాని మోడీ ప్రకటించాలి అని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అటు దేశ ప్రజలను, ఇటు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు నిరసనగా రెండు రోజులు నల్ల జండాలు, బ్యాజ్జీ లతో నిరసనలకు వామపక్షాలు ఇచ్చిన పిలుపులో బాగంగా శుక్రవారం సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, సీపీ ఎమ్ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, ల అధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన నిరసన తెలిపారు. ఈ సందర్బంగా శ్రీరామ్మూర్తి, గోవిందరావు లు మాట్లాడుతూ దేశ ప్రజలను మోడీ మోసం చేస్తున్నారు అని, మోడీ పాలనలో దేశం లోని అన్ని రంగాలు కుదేలు అయ్యాయి అన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత రాష్ట్రానికి కల్పించాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాలు పేరుతో ప్రవేట్ పరం చెయ్యాలని చూస్తున్నారు అని, దీన్ని రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని మోడీ వైజాగ్ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చెయ్యటం లేదని ప్రకటించి, రాష్ట్ర విభజన హామీలు కూడా అమలు చేస్తున్నట్లు ప్రకటించాలన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ లను అన్ని దేశాలు వ్యతిరేకిస్తూ ఉంటే శ్రీకాకుళం జిల్లా లో ఏర్పాటు చేయటం దారుణం అన్నారు. గుజరాత్ లో ఏర్పాటు చేయాల్సిన ఆ ప్లాంట్ ను తన స్వంత రాష్ట్ర నష్టపోకుండా ఉండేందుకు శ్రీకాకుళం కి తరలించారు అని, అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఆపాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రం కి మోడీ చేస్తున్న అన్యాయం పట్ల రాష్ట్రం లోని వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నోరు మేదపటం లేదని ప్రశ్నించారు. మోడీ ఇన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పెద్దలు మోడీ సభకు జన సమీకరణం చెయ్యటం సిగ్గు చేటు అన్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల మనోభావాలను పట్టించు కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మోడీ కి తాకట్టు పెట్టే విధానాలను రాష్ట్ర రాజకీయ పార్టీలు మానుకోవాలి అని హెచ్చరించారు. పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలను సంగటితం చేసి ఉద్రుత పోరాటాలు చేస్తాం అని అన్నారు. ఈ నిరసన లో సీపీ ఎమ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీ. కృష్ణమూర్తి, ఏ ఐ టీ యూ సీ జిల్లా గౌరవ సలహా దారు చిక్కాల గోవింద రావు, సీపీఐ శ్రీకాకుళం నగర కార్యదర్శి డోల శంకర రావు, డీ హెచ్ పీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బలగ రామారావు, సీపీఐ నాయకులు పి. అప్పారావు, ఎమ్ భాస్కర రావు , జమ్మా న రామారావు, ఐ ఎఫ్ టీ యు నాయకులు ఎన్. నీలం రాజు, సీపీ ఎం నాయకులు తిరుపతి రావు, మోహన రావు, తేజేశ్వరరావు, లక్ష్మి, వివిధ ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img