Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

ముంపు ప్రాంతాలకు సామాగ్రి తరలింపు

విశాలాంధ్ర, పార్వతీపురం:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు వరద బాధితులసహాయార్థం పార్వతీపురం నియోజక వర్గంలోని బలిజిపేటమండలం నుండి లక్షా 60వేలరూపాయలు విలువచేసే సామాగ్రిని, దుస్తులను బుదవారం ప్రత్యేక వాహనంద్వారా పంపించారు. వరదప్రాంతాల్లోబాధితులకు సహాయార్థంచేసే నిమిత్తం పంపిస్తున్నట్లు టీడీపి మండలంపార్టీఅధ్యక్షులు పి. వేణు గోపాలనాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాడాడ రాములు చెప్పారు. ఈకార్యక్రమంలో పెదపెంకి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img