Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్య‌తోనే పేద‌రికం దూరం

ప‌దోత‌ర‌గ‌తిలో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించాలి

500 మంది విద్యార్థుల‌కు ప‌రీక్ష సామాగ్రి అంద‌జేసిన డాక్ట‌ర్ సూర శ్రీ‌నివాస‌రావు
విశాలాంధ్ర – రణస్థలం/లావేరు:( శ్రీకాకుళం): విద్య‌తోనే పేద‌రికాన్ని జ‌యించ‌వ‌చ్చుని, విద్యార్థులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలిగి ఉన్న‌త ల‌క్ష్యాల‌కు చేరుకోవాల‌ని ఎస్ ఎస్ ఆర్ చారిట‌బుల్ ట్ర‌స్టు అధినేత సూర శ్రీ‌నివాస‌రావు అన్నారు. లావేరు, ర‌ణ‌స్థ‌లం మండ‌లాల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్న 500 మంది విద్యార్థుల‌కు అట్ట‌, పెన్ను, ప‌రీక్ష సామ‌గ్రిని శుక్ర‌వారం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ సూర శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ పేదరికంలోనుంచి బయటపడాలంటే విద్యకు మించిన సాధనం లేదని, మంచి ప్ర‌ణాళిక‌తో విద్య‌న‌భ్య‌సించ‌డం ద్వారా భ‌విష్య‌త్‌లో ఉన్న‌త ల‌క్ష్యాల‌ను సాధించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా కష్టపడి చదవాలని పదోతరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 100కు 100 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి మీ త‌ల్లిదండ్రుల‌కు, ఉపాధ్యాయుల‌కు మంచిపేరు తీసుకురావాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల అధ్యాప‌కులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img