Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లుపై అధ్యాపకుల ముమ్మర ప్రచారం

కళాశాల ప్రిన్సిపాల్ రేణుక
విశాలాంధ్ర – సీతానగరం : ప్రైవేటు జూనియర్ కళాశాలకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యను అందించే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిల్లలను చేర్పించాలని కోరుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బొబ్బిలి రేణుక తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సిఈసి సాదారణ కోర్సులతోపాటు
ఓఏ, సిఈటి, ఎంఅండ్ ఏఈ, ఎంపిహెచ్ డబ్ల్యు (మహిళలు) వృత్తివిద్యా కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు రెండు బ్యాచులుగా ఏర్పడి ప్రతీరోజూ అడ్మిషన్లు గూర్చి ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం లక్ష్మిపురం, చెళ్లంనాయుడువలస గ్రామాలను అధ్యాపకులు తెర్లి రవికుమార్, అల్లాడ రామారావునాయుడు, నవీన్ కుమార్, అచ్చేంనాయుడులు వెళ్లగా,సీతానగరం, పెదబోగిలి, బుడ్డిపేట, అప్పయ్యపేట గ్రామాలలో అధ్యాపకులు దాసరి రామకృష్ణ,అమ్మాజీ,మయూరి, ఇందిరలు వెళ్లి ప్రవేశాలు గూర్చి ప్రచారాన్ని నిర్వహించారు. ఆధునాతన సౌకర్యాలు, లాబ్,ప్రహరీ, విశాలతరగతి గదులు, అత్యుత్తమ పలితాలు, పోటీప్రపంచానికి తగ్గ విద్యను అందించడం వంటి సౌకర్యాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాయని ప్రిన్సిపాల్, అధ్యాపకులు తెలిపారు. ప్రతీరోజూ విధ్యార్ధుల సమచారంను తల్లిదండ్రులకు తెలియజేస్తామని చెప్పారు.ప్రభుత్వం అందజేస్తున్న విద్యాపరమైన పథకాలు అందజేయడంపై ప్రత్యేక శ్రద్ద తీసుకొంటామని తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారులు ఉత్తర్వులు, సూచనలు, సలహాల మేరకు అడ్మిషన్లు శతశాతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img