Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

విశాలాంధ్ర,కురుపాం: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు అంగన్వాడీ కేంద్రాలు ను తహసీల్దార్ ,ఎంపీడీవో లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా విద్యార్థులు హాజరు ,రికార్డులను ,పౌష్టికాహారం అందిస్తున్న తీరు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం కురుపాం మేజర్ పంచాయతీ పూతిక వలస అంగన్వాడీ కేంద్రం ను తహశీల్దార్ రమేష్ కుమార్ ,ఆర్ ఐ ప్రసాద్ తదితరులు తనిఖీ చేశారు అనంతరం మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల ను పరిశీలించారు. అలాగే ఎంపీడీవో నాగేశ్వరరావు గుమ్మ ,మొండెంఖల్ అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేశారు. గర్బినీలు ,బాలింతలు ,చిన్నారులతో మాట్లాడుతూ పౌష్టికాహారం పంపిణీ తీరు తెలుసుకునీ ,రికార్డులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img