Friday, April 26, 2024
Friday, April 26, 2024

మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై చర్యలు తప్పవు

పాలకొండ డి.ఎస్.పి కృష్ణారావు
విశాలాంధ్ర,కురుపాం: ఎల్విన్ పేట సర్కిల్ పరిధిలో ఎల్విన్ పేట, కురుపాం పోలీస్ స్టేషన్లో పరిధిలో నాటుసారాతో పట్టుబడిన 8 ద్విచక్ర వాహనాలకు వేలంపాటని మంగళ వారం నిర్వహించారు.
ఈకార్యక్రమానికి పాలకొండ డిఎస్పి జీవి కృష్ణారావు హాజరయ్యారు. ముందుగా డిఎస్పి కృష్ణారావు పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కను నాటడం జరిగింది, తరువాత వాహనాలు వేలం పాట ప్రారంభించారు. ఈవేలంపాటలో ఎల్విన్ పేట స్టేషన్ పరిధిలో నాలుగు వాహనాలను 49,548 రూపాయలుతో వేలంపాట దారులు వేలంపాటలో వాహనాలు దక్కించుకోవడం జరిగింది. కురుపాం పోలీస్ స్టేషన్ కు సంబంధించి నాలుగు వాహనాలను 64,192 రూపాయలతో వేలం పాట దారులు వాహనాలు దక్కించు కున్నారు.
ఈసందర్భంగా పాలకొండ డిఎస్పి జీవీ కృష్ణారావు మాట్లాడుతూ, లైసెన్సు లేని మైనర్లు ఎక్కువగా వాహనాలు నడపడం త్రిబుల్ డ్రైవింగ్ ద్వారానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని లైసెన్స్ లేని వాళ్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, నంబరు లేని వాహనాలు పట్టు బడితే సీజ్ చేయడం జరుగుతుందని, మద్యం తాగిడ్రైవింగ్ చేయరాదని, ఈ విషయాలపై ఎప్పటికప్పుడు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందని అన్నారు,ఈ కార్యక్రమంలో ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎలివిన్ పేట ఎస్ఐ షణ్ముఖరావు, కురుపాం ఎస్ఐ ప్రసాద్ రావు, ఏఎస్ఐ శంకర్రావు, హెచ్ సి దొర, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img