Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

జిల్లాపథక సంచాలకులు సత్యంనాయుడు

విశాలాంధ్ర,సీతానగరం: మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా వెలుగు పిడి సత్యం నాయుడు పిలుపునిచ్చారు. మంగళ వారం నాడు స్తానిక వెలుగు కార్యాలయంలో మండల సమైక్య సమావేశం జరగగా అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతీ మహిళా ఆన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున పథకాలను మహిళల పేరిట ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు.మహిళలకు ఇళ్ళు స్థలాలు, ఇల్లును మంజూరు చేయడమే గాక జగనన్న హౌసింగ్ లబ్ధిదారులకు లోన్లు కూడా వెలుగు ద్వారా మంజూరుచేసి ఆర్థిక సహాయాన్ని చేస్తున్నామని తెలిపారు.చేయూత లబ్ధిదారులకు జీవినోపాదులు.,బ్యాంకు ఋణాలుమరియు స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేసి వారి జీవితం మెరుగు పరిచేందుకు వెలుగు సహకారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో డిపిఎం రాజ్ కుమార్, ఏపిఎం శ్రీరాములు నాయుడు, వెలుగు సీసీలు, మండల, గ్రామైక్యసంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img