Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సిక్కోలు వాసి

మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మెట్ట వెంకు బట్లు

విశాలాంధ్ర – శ్రీకాకుళం: తెలంగాణ రాష్ట్రంలో మన సిక్కోలు వాసి మెట్ట వెంకు బట్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. సోమవారం తెలంగాణ రాష్ట్రంలో గల మేడ్చల్ – మల్కాజిగిరి కలెక్టరేట్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 57 మందిని జడ్పీ చైర్మన్ శరత్చంద్రా రెడ్డి , జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహా రెడ్డి , జాన్ శ్యాంసన్ తో కలిసి మంత్రి మల్లారెడ్డి సన్మానించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం,పొందూరు మండలం తాడివలస గ్రామానికి చెందిన మెట్ట వెంకు బట్లు తెలంగాణ రాష్ట్రంలో గల మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో దుండిగల్ మండలం బహుదూర్ పల్లి జిల్లా పరిషత్త్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన పాఠశాలలో ప్రభావశీలిమైన ఉపాధ్యాయునిగా రాణిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, బోధనలో ఆదర్శవంతమైన ప్రతిభ కనబరచడంతో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. వెంకు బట్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం పట్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు, తాడివలస గ్రామస్తులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈవో విజ యకుమారి , జవహర్ నగర్ మేయర్ కావ్య , జడ్ఫీ టీసీ సభ్యురాళ్లు అనిత , శైలజ , మేడ్చల్ ఎంపీపీ రజనీ , ఉపాధ్యాయ సంఘాల జిల్లా , మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img