Friday, August 19, 2022
Friday, August 19, 2022

అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

కేంద్రమంత్రి అమిత్‌షాను కోమటిరెడ్డి బ్రదర్స్‌ కలిశారు. అమిత్‌షాను రాజగోపాల్‌రెడ్డి , వెంకటరెడ్డి వేర్వేరుగా కలిశారు. వ్యక్తిగతంగా అమిత్‌షాను రాజగోపాల్‌రెడ్డి కలిశారు. మరోవైపు వరద సాయంపై అమిత్‌షాను వెంకటరెడ్డి కలిశారు. సమావేశం అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో వరద నష్టాలపై అమిత్‌షాతో చర్చించానని తెలిపారు. వరద బాధితుల కష్టాలను అమిత్‌షాకు తెలియజేశానని చెప్పారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల రూ.1400 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. ఈ భేటీకి తాను వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం జరిగేదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img