Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

అమిత్‌షాతో సీఎం కేసీఆర్‌ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం అమిత్‌షాను కలిశారు.ఈ సందర్భంగా ఆయన కొన్ని వినతులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే పోలీసు శాఖలోనూ మార్పులు జరిగాయన్నారు. అయితే పోలీసు శాఖలో ఐపీఎస్‌ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రిని కోరారు. మరోవైపు నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img