Tuesday, November 29, 2022
Tuesday, November 29, 2022

అమిత్‌ షాని కలిసిన ఈటల


కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌ కలిసి ఉన్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై, దీంతో పాటు హుజూరాబాద్‌ ఉపఎన్నికకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్న తీరును అమిత్‌ షాకు రాష్ట్ర నేతలు వివరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ, అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నామన్నారు. అలాగే ఆగస్టు 9 నుంచి తలపెట్టిన పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలను మంత్రి అమిత్‌ షాకు తెలిపి ఆయన్ని ఆహ్వానించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img