Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఈటల : మోత్కుపల్లి

దళితబంధును బీజేపీ నేతలు ఎన్నిరోజులు ఆపగలరని టీఆర్‌ఎస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, హాస్టల్‌లో ఉండి చదువుకున్న ఈటలకు అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని అడిగారు. ఎన్నికల సందర్భంగా అవినీతి సొమ్మును భారీ ఎత్తున్న పంచుతున్నాడని ఆరోపించారు.అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఈటల అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌తో హుజూరాబాద్‌ ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు.హుజూరాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img