Monday, September 26, 2022
Monday, September 26, 2022

ఇతర రాష్ట్రాలు ఆచరించేలా రాష్ట్రంలో పథకాలు అమలు

మంత్రి సత్యవతి రాథోడ్‌
ఇతర రాష్ట్రాలు ఆచరించేలా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయని కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఇవాళ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్‌లో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మహిళలు, పిల్లల సంరక్షణ చర్యలను సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. గిరిజన మహిళలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్‌ జిల్లాలో పోషణ్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక్క కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్యవిహహాలకు అడ్డుకట్ట వేశారని చెప్పారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు చాలా తగ్గిందని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img