Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఉద్యోగుల పాలిట రాక్షస సర్కార్‌..

తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఫైర్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల పాలిట రాక్షస సర్కార్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి కారణంగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని… 42 రోజుల సమ్మెలో 20 మంది వీఆర్‌ఏలు చనిపోయారని మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో జీతాలు రాక కొందరు, జీతాలు ఆలస్యమై కొందరు. ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయేమో అన్న అయోమయంలో కొందరు ప్రాణాలు వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్‌ఏ అశోక్‌ ఆత్మహత్య, ఖమ్మం జిల్లా కల్లూరులో బలవన్మరణానికి పాల్పడిన మహిళా పంచాయతీ కార్యదర్శి ఘటనలపై రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img