Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

తెలంగాణకు రాహుల్‌గాంధీ..షెడ్యూల్‌ ఇదే!

ఈనెల 6,7 తేదీల్లో రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ పర్యటన షెడ్యూల్‌ ఖారరైంది. మే 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడినుండి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు రాహుల్‌గాంధీ ప్రసంగం ప్రారంభంకానుంది.సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ చేరుకోనున్నారు. దుర్గం చెరువు పక్కనే ఉన్న కోహినూర్‌ హోటల్‌లో రాహుల్‌గాంధీకి బస ఏర్పాటుచేశారు. మే 7న ఉదయం కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో కలిసి కోహినూర్‌ హోటల్లో బ్రేక్‌ ఫాస్ట్‌ చేయనున్నారు. గాంధీభవన్‌లో 200 మంది ముఖ్యనేతలతో సమావేశం,డిజిటల్‌ మెంబర్‌ షిప్‌ ఫొటో సెషన్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దిల్లీకి పయనం కానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img