Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు


తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పద్మశ్రీ అవార్డుల విషయంలోనూ అన్యాయమే జరిగిందని అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, టూరిజంతో పాటు పలు విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు.తెలంగాణలో కళాకారులు, విశిష్ఠ వ్యక్తులు ఉన్నారని, పద్మశ్రీ అవార్డు కోసం జాబితా పంపాలా? వద్దా? అని ప్రధాని మోదీ, అమిత్‌షాను కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు.58 సంవత్సరాలు సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటామన్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img