Monday, December 5, 2022
Monday, December 5, 2022

తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో రెండోరోజు కొనసాగుతోంది. భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో నిన్న ప్రవేశించింది. భారత్‌ జోడో యాత్ర ఈ రోజు మక్తల్‌ నుంచి ప్రారంభమైంది. దండు, కాచ్వార్‌ మీదుగా బొందలకుంట వరకు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రైతులతో భేటీ కానున్నారు. ఈ యాత్రలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీతో కాంగ్రెస్‌ నాయకులు ముచ్చటించి.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన ప్రణాళికలను వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img