Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

నిధులు లేక సర్పంచులు ఇబ్బందులు…నిజం కాదు

అందులో నిజం లేదు…: మంత్రి ఎర్రబెల్లి
నిధులు లేక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారనడంలో నిజం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కి కూడా కనీసం 5 లక్షల రూపాయలు అందుతున్నాయన్నారు. సోమవారం శాసన మండలి లో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పురాణం సతీశ్‌, శేరి సుభాష్‌ రెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమాధానమిచ్చారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు గౌరవ వేతనం పెంచడంతో పాటు, అభివృద్ధి నిధులను కూడా బాగా పెంచినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. 2014-15 నాటికి 7 కోట్ల 12 లక్షల నిధులు ఎంపీపీలు, జెడ్పీటీసీలకు అందగా, 2020-21 ఏడాదికి 274 కోట్ల 70 లక్షలు అందించామన్నారు. 2021-22 ఇప్పటివరకు 102 కోట్ల 36 లక్షలు అందజేశామని, మొత్తం 423 కోట్ల 18 లక్షలు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో 2004-05 నుండి 2013-14 వరకు 10 సంవత్సరాలలో తలసరి గ్రాంటు, సీనరేజి, గౌరవ వేతనం, పన్నులు అన్నీకలిపి ఎంపీపీలకు, జేడ్పీపీలకు కేవలం 473 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img