Monday, March 20, 2023
Monday, March 20, 2023

ప్రజల సహకారం ఉంటే త్వరలోనే కరోనా థర్డ్‌వేవ్‌ నుంచి బయటపడతాం

: మంత్రి హరీష్‌రావు
ప్రజల సహకారం ఉంటే త్వరలోనే కరోనా వేవ్‌ నుండి బయటపడవచ్చని మంత్రి హరీష్‌రావు అన్నారు.శనివారం నాడు సత్తుపల్లిలో హరీష్‌రావు పర్యటించారు. వంద పడకల ఆస్పత్రికి హరీష్‌ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ కిట్‌లు వచ్చిన తర్వాత వందశాతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీలు పెరిగాయన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేశామని, కళ్యాణ లక్ష్మీ పథకం కింద 10 లక్షల పెళ్లిళ్లు జరిగాయని తెలిపారు. సంక్షేమ ప్రభుత్వానికి చిరునామాగా కేసీఆర్‌ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌ తర్వాత ఒక్క ఖమ్మంలోనే కేతల్యాబ్‌ ఏర్పాటు చేసినట్లు హరీష్‌ వెల్లడిరచారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్కక్తంచేశారు. రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే బాగా జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img