Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శం

: మంత్రి నిరంజన్‌ రెడ్డి
దేశంలో పంటల ఉత్పాదకత పెంచేందుకు ఆధునిక వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మొదలైందని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.ప్రజల ఆహార అవసరాలను తీర్చేందుకు నూతన పద్ధతులను అనుసరించడం ప్రారంభించారని తెలిపారు. మనవాళికి, జీవరాశికి అవసరమైన ఆహారమంతా ఈ భూమి నుంచి ఉత్పత్తికావాల్సిందేనని చెప్పారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా ఆవశ్యకతపై జరిగిన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమన్నారు.అమెరికాలో స్థిరపడిన రమేష్‌ రాలియా నానో యూరియాను కనుగొన్నారని, భారత రైతాంగం శ్రేయస్సు కోసం నానో యూరియా టెక్నాలజీని ఇఫ్కోకు అందించారని చెప్పారు. నానో టెక్నాలజీతో తొలిసారిగా యూరియాను ద్రవరూపంలో తీసుకొచ్చారని వెల్లడిరచారు. దీంతో ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img