Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు : మంత్రి హరీశ్‌రావు

ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దనిమంత్రి హరీశ్‌ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట దవాఖానలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్‌ చేస్తాం అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు అయితే నేడు 56 శాతం అవుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img