Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మంత్రి గంగుల కమలాకర్‌ కారులో పోలీసుల సోదాలు..

మునుగోడులో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. మునుగోడు వైపు వెళుతున్న ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ అని తేడా లేకుండా రాష్ట్ర పోలీస్‌ బలగాలతోపాటు, కేంద్ర బలగాలు సైతం తనిఖీలు చేపడుతున్నారు. ఇందులోభాగంగానే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ వాహనాన్ని చౌటుప్పల్‌ వద్ద, సంస్థాన్‌ నారాయణపురం వద్ద రెండు చోట్లా సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు, కేంద్ర బలగాలు చెక్‌ చేశారు. తనిఖీల సమయంలో పోలీసులకు పూర్తిగా మంత్రి గంగుల కమలాకర్‌ సహకరించారు. కారులోని అన్ని బ్యాగులను మంత్రి వ్యక్తిగత సిబ్బందితో తెరిపించి తనిఖీ చేసిన అనంతరం సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img