Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

మళ్లీ మళ్లీ కేసీఆర్‌ మాయలో పడొద్దు…మోసపోవద్దు : వైఎస్‌ షర్మిల

కేసీఆర్‌నీ నమ్మి తెలంగాణ తన చేతిలో పెడితే ప్రజలను నట్టేట ముంచేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. 11వ రోజు పాదయాత్రలో సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. ప్రతి వర్గాన్ని కేసీఆర్‌ మోసం చేశారని అన్నారు. రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశారని,. కేజీ టూ పీజీ అని చెప్పి విద్యార్థులను మోసం చేశారని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు అని చెప్పి పేదలను మోసం చేశారని అన్నారు. పెన్షన్లు ఆపి వృద్ధులను మోసం చేశారు.10 లక్షల మంది పెన్షన్లు దరఖాస్తులు పెట్టుకున్నారని అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి యావత్‌ తెలంగాణను కేసీఆర్‌ మోసం చేశారని అన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ… ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది. మళ్లీ మళ్లీ కేసీఆర్‌ మాయలో పడొద్దు…మోస పోవద్దు అని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img