Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

మేడారం జాతరకు సర్వం సిద్ధం

18న జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్‌
మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది.ఈ నెల 16 నుంచి 19 వరకు మూడు రోజులపాటు జాతర జరగనుంది. జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 75 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు రానుండడంతో ట్రాఫిక్‌ సమస్యపై అధికారులు దృష్టి పెట్టారు. జాతరలో వాహనాల కోసం 33 పార్కింగ్‌ స్థలాలు, 37 ట్రాఫిక్‌ హోల్డింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌తో పాటు ఇతరాత్ర సమాచారం తెలిపేందుకు జాతర మార్గంలోని రహదారులపై 20 డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు పెట్టారు.
కాగా మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా జారతకు రానున్నట్టు తెలిపారు. జాతరకు అన్నివర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరకు విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img