Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

యూనివర్సిటీల్లో ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు? : షర్మిల

విద్యార్థుల భవిష్యత్‌పై సీఎం కేసీఆర్‌కు ఆలోచన లేదా?….మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా అని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు. వర్సిటీలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎదుట నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యూనివర్సిటీల్లో ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ఉస్మానియా యూనివర్సిటీ 33 శాతం, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలే ఎక్కువగా ఉన్నాయన్నారు. అనంతరం ప్రతి మంగళవారం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఫీుభావంగా చేపట్టే నిరాహారదీక్షలో ఆమె కూర్చున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img