Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

రాష్ట్రంలో తైవాన్‌ పెట్టుబడులకు ఆది నుంచి అత్యంత ప్రాధాన్యత


మంత్రి కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్రం తైవాన్‌ పెట్టుబడులకు ఆది నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా తెలంగాణతైవాన్‌ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందన్నారు. ఇన్వెస్ట్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్‌కనెక్ట్‌ తెలంగాణ స్టేట్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు.2020వ సంవత్సరం నుంచి వ్యాపార వాణిజ్య పరిస్థితులకు కరోనా సంక్షోభం సవాళ్లను విసిరిందని, అయితే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని కేటీఆర్‌ వ్యక్తం చేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విషయంలో తెలంగాణ ప్రతిసారి అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ వస్తుందన్నారు.
తమ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని, ఈ దిశగా తైవాన్‌ కు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటామని కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, టీ ఫైబర్‌ సీఈవో సుజయ్‌ కారంపూరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img