Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు


తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది. ఈ ప్రభావంతో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తాయయని పేర్కొంది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 26.77 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img