Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

రోడ్డు విస్తరణలో ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు : మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌ పట్టణంలోని చైన్‌ గేట్‌ నుంచి బంగల్‌ పేట్‌ వరకు రూ. 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరేశ్వర్‌ వాడ చౌరస్తా శిలాపలకాన్ని ఆవిష్కరించి పనులు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న రోడ్డు వెడల్పు పనులు పట్టణ ప్రజల సహకారంతో పూర్తి చేశామన్నారు. రోడ్డు వెడల్పుతో ఇరుకు రోడ్ల సమస్య తొలగి పోయిందని చెప్పారు. చైన్‌గేట్‌ నుంచి బంగల్‌ పేట్‌ వరకు రోడ్డు విస్తరణలో ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారన్నారు. రూ.5 కోట్లతో బీటీ రోడ్డు పనులు పూర్తి చేసి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img