Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత


హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల్లో భాగంగా భారీగా హెరాయిన్‌ పట్టుబడిరది.3.2 కిలోల డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు.జాంబియాకు చెందిన మహిళ ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో దిగింది. ఆమె డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు నిలిపి బ్యాగులను తనిఖీ చేసి 3.2 కిలోల డ్రగ్స్‌ను గుర్తించారు. దాన్ని పరీక్షించి హెరాయిన్‌గా నిర్ధారించి సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ విలువ 21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img