Monday, September 26, 2022
Monday, September 26, 2022

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద

నిజామాబాద్‌ జిల్లాల్లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో 70,620 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 16 గేట్ల ద్వారా 49,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులుగా ఉన్నది. గరిష్ఠ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను దాదాపు పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img