Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండ

: మంత్రి నిరంజన్‌ రెడ్డి
సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా నిలుస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రణాళికాబద్ధంగా తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గురువారం వనపర్తిలోని తన నివాసంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత, దేశంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల మూలంగా ప్రస్తుతం దేశమంతా కరెంట్‌ కోతలతో సతమవుతున్నదని పేర్కొన్నారు. . ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణలో కరెంట్‌ ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img