Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆయిల్‌ పామ్‌ సాగుకు తగు చర్యలు తీసుకోవాలి

అధికారులను ఆదేశించిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌
తెలంగాణలో ఆయిల్‌ పామ్‌ సాగు పురోగతిపై బి.ఆర్‌.కె.ఆర్‌. భవన్‌లో హార్టికల్చర్‌, పరిశ్రమల శాఖల అధికారులతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టడానికి రాష్ట్ర కేబినెట్‌ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించినట్లు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 18 నర్సరీలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా 23.41 లక్షల ఆయిల్‌ పామ్‌ మొలకలు లబించాయని, 36,000 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగుకు సరిపోతాయని సంబంధిత అధికారులు తెలిపారు. 2.11 కోట్ల ఆయిల్‌ పామ్‌ మొలకల కోసం వివిధ కంపెనీలకు సరఫరా నిమిత్తం ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు వెంకట్రామ్‌ రెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ ఎం.డి.సురేందర్‌ లు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img