Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

సంగారెడ్డిలో కొనసాగుతున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర..

తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రాహుల్‌ పాదయాత్ర కొనసాగుతోంది. చౌటకూర్‌ మండలం సుల్తాన్‌?పూర్‌ నుంచి రాహుల్‌ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం మెదక్‌ జిల్లా గడిపెద్దాపూర్‌ దగ్గర కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. అల్లాదుర్గ్‌ సమీపంలో రాత్రి బస చేయనున్నారు.
భారత్‌ జోడో యాత్రలో అపశృతి.. కానిస్టేబుల్‌ కాలిపై నుంచి వెళ్లిన కారు..
ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో రాహుల్‌ యాత్ర సాగుతుండగా రాహుల్‌ కాన్వాయ్‌ కానిస్టేబుల్‌ కాలుపై నుంచి వెళ్లింది. దీంతో కానిస్టేబుల్‌ కాలు విరిగింది. పాపన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో శివకుమార్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img