Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

సీఎస్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల భేటీ

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ మేరకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు జగ్గారెడ్డి, అజారుద్దీన్‌ లు సీఎస్‌ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్‌ నేతలు వినతిపత్రం అందజేశారు. ధరణిని రద్దు చేసి పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అర్హులకు అసైన్డ్‌ భూములు పట్టాలు ఇవ్వాలని టీకాంగ్రెస్‌ నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img