Monday, December 5, 2022
Monday, December 5, 2022

సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి..

: తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు
ర్షాలు పడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు భయపెడుతున్నాయని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ చెప్పారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. గతంతో పోల్చుకుంటే డెంగ్యూ, మలేరియా కేసులు రాష్ట్రంలో తక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. ప్రజల్లో ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అనేదానిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తున్నామని తెలిపారు. జిల్లాలలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మెడికల్‌ మస్కిటో నెట్స్‌, రాపిడ్‌ డయగ్నస్టిక్‌ టెస్ట్‌ కిట్‌ లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img