Monday, February 6, 2023
Monday, February 6, 2023

సైన్స్‌,మాథమేటిక్స్‌, ఎన్విరాన్మెంట్‌ ప్రదర్శను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జిల్లా కొత్తగడిలో 50వ జిల్లా స్థాయి సైన్స్‌,మాథమేటిక్స్‌, ఎన్విరాన్మెంట్‌ ప్రదర్శనను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటానికి ఇలాంటి సైన్స్‌ ఫేర్‌ లుఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు.వికారాబాద్‌ జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాక్షించారు. వికారాబాద్‌ జిల్లాలో సైన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.సమస్యతోనే పరిష్కారం పుట్టుకు వస్తుందని,కరోనా సమయంలో మందుల సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా సాగేలా,త్వరితగతిన చేరేలా డ్రోన్‌ సహాయంతో జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ గా చేపట్టడం జరిగిందన్నారు.వ్యాపారాలు,పారిశ్రామిక వేత్తలుగా రాణించాటానికి ప్రభుత్వం టి హబ్‌ ద్వారా కృషి చేస్తుందని.. ఇందులో విద్యార్థుల కోసం కొంత స్పెస్‌ కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img