Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 12గంటల వరకు వర్షం వచ్చే సూచనలు కనిపించలేదు.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, యూసఫ్‌ గూడ, అమీర్‌ పేట, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, నార్సింగి, మణికొండ, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, ఫిల్మ్‌ నగర్‌, గచ్చిబౌలి, పంజాగుట్ట ప్రాంతాల్లో వాన పడుతోంది. వర్షం కారణంగా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img