Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

హైదరాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

ఈనెల 5న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం ఇక్రిశాట్‌ను సందర్శించి, సంస్థ నూతన లోగోను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబద్‌ శివారులోని ముచ్చింతల్‌ వెళ్లనున్నారు. రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మోదీ పాల్గొంటారు. రాత్రి 8.25 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మోదీ చేరుకుని దిల్లీకి బయలుదేరుతారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.ఆంక్షలు కూడా విధించారు. బందోబస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బీర్కే భవనంలో గురువారం ఉదయం సమావేశమై సమీక్షించారు. ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img