Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంత తేలికగా తీసుకోవొద్దు.. రేవంత్‌ రెడ్డి కొత్త పార్టీ ప్రచారంపై వీహెచ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో జూనియర్లు, సీనియర్ల మధ్య పదవుల చిచ్చు క్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారుతోంది. రేవంత్‌ రెడ్డి రాజకీయంగా రూటు మార్చబోతున్నారని, తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ స్థాపించేందుకు సమాలోచనలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. గత కొంతకాలంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై గట్టిగా వాయిస్‌ వినిపించడం లేదు. ఇంతకుముందులా కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదు. ఇలాంటి తరుణంలో రేవంత్‌ కొత్త పార్టీ ప్రచారం చర్చనీయాంశమైంది.సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటికీ ఈ వ్యవహారంపై రేవంత్‌ రెడ్డి స్పందించకపోవడంతో ఊహాగానాలు మరింతగా సర్క్యూలేట్‌ అవుతున్నాయి. ఇంతగా ప్రచారం జరుగుతున్నా రేవంత్‌ నుంచి క్లారిటీ రాకపోవడంతో.. ఇది నిజమోననే భావన సోషల్‌ మీడియాలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి కొత్త పార్టీ ప్రచారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు స్పందించారు. ‘రేవంత్‌ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంత తేలికగా తీసుకోవొద్దు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను రేవంత్‌ సీరియస్‌గా తీసుకోవాలి. వీటిపై ఫుల్‌ క్లాటీ ఇవ్వాలి. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ను మార్చి వేరే వారిని ఇంచార్జ్‌గా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌ వచ్చి సీనియర్‌ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. దిగ్విజయ్‌ సింగ్‌ ఢల్లీి అధిష్టానానికి ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది చూడాలి. ఆయన నివేదికతో అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా’ అని వీహెచ్‌ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఇచ్చిన తీర్పుపై వీహెచ్‌ స్పందించారు. ఈ కేసులో సిట్‌ను పూర్తిగా పక్కన పెట్టారని, ఈడీ, సీబీఐ సంస్థలను బీజేపీ తమ అవసరాలకు వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి కొత్త పార్టీ స్థాపించబోతున్నారని, వచ్చే ఎన్నికల తర్వాత సొంత దారి చూసుకునే ఆలోచనలో ఉన్నారంటూ ఇటీవల మాజీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రేవంత్‌ రెడ్డి కొత్త పార్టీ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లు అయింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని టీపీసీసీ ఖండిరచింది. ప్రచారం చేస్తున్న శంకర్‌ అనే వ్యక్తిపై టీపీసీసీ నేతలు హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img