Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడంపై సుప్రీంలో పిల్

ఈ నెల 24న విచారిస్తామన్న సుప్రీం ధర్మాసనం
ఢిల్లీ లిక్కర్ కేసులో బుధవారం మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే! విచారణలో భాగంగా తెలంగాణ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కూమార్తె కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ఈ నెల 11న ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారించారు. ఆపై ఈ నెల 16న మరోమారు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు.ఈడీ నోటీసుల మేరకు ఈ నెల 16 (గురువారం) కవిత మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత తరఫున సుప్రీంకోర్టులో బుధవారం ఓ పిటిషన్ దాఖలైంది. మహిళను ఈడీ విచారణకు పిలవొచ్చా అని పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిల్ దాఖలు చేసింది ఎవరనేది ప్రస్తుతానికి బయటకురాలేదు. ఈ పిటిషన్ ను విచారణకు చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. మధ్యంతర రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నెల 24న విచారిస్తామని పేర్కొంది. అయితే, గతంలో సోనియా గాంధీ సహా పలువురు మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి అధికారులు విచారించినట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img