Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కేసుల సంఖ్య పెరిగితే.. ప్రజారక్షణ మేరకు సరైన నిర్ణయాలు తీసుకుంటాం : కేటీఆర్‌

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 2,707 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.రాష్ట్రంలో ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ మొదలైందని, సంక్రాంతి తర్వాత ఊహించని రీతిలో కేసులు నమోదవుతాయని వైద్య శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అంటూ రకరకాల ప్రచారాలు కొనసాగుతున్నాయి.దీనిపై ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. ‘ఆస్క్‌ కేటీఆర్‌’ పేరుతో ట్విటర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో లాక్‌డౌన్‌పై ఓ నెటిజన్‌ ప్రశ్నించగా… కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకే నిర్ణయాలు ఉంటాయని వెల్లడిరచారు. ప్రస్తుతానికైతే కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ లాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేవని స్పష్టం చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరిగితే మాత్రం ప్రజారక్షణ మేరకు సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img