Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలంగాణలో నీటి ప్రాజెక్టులు బాగున్నాయి : సీఎం భ‌గ‌వంత్ మాన్

సిద్దిపేట జిల్లాలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలు, నీటి పారుదల ప్రాజెక్టులను ఆయ‌న‌ పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కొండ పోచమ్మ సాగ‌ర్‌ రిజర్వాయర్ ను ప‌రిశీలించి.. ప్రాజెక్టును నిశితంగా పరిశీలించారు. ప్రాజెక్టు వివ‌రాల‌ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంజాబ్ లో నీటిని కాపాడేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోనున్నామ‌ని, అందులో భాగంగానే తెలంగాణ‌లోని నీటి ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి సమాచారం తెలుసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ వద్ద డ్యామ్‌ను పరిశీలించేందుకు వచ్చాం అని సీఎం భ‌గ‌వంత్ మాన్‌ ట్వీట్ చేశారు. భూగర్భ జలాలను ఆదా చేసే సాంకేతికత గురించి సమాచారాన్ని తెలుసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జలాలను కాపాడేందుకు గ్రామాల్లో చిన్న డ్యామ్‌లు నిర్మించిందని, దాని వల్ల ఇక్కడ భూగర్భ జలాలు 2 మీటర్ల వరకు పెరిగాయన్నారు. అనంతరం మర్కుక్ మండలం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్ డ్యాంను పరిశీలిస్తారు. ఆ తర్వాత మల్లన్ సాగర్, గజ్వేల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చెందిన పాండవుల చెరువుని కూడా పరిశీలిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img