Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో రైతు ప్రభుత్వం రాబోతోంది : సీఎం కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గుజరాత్‌ మోడల్‌ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశారని కేసీఆర్‌ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.పెద్దపల్లి జిల్లా అవుతుందని మనం కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి పెద్దపల్లిని జిల్లా చేసుకున్నాం. అద్భుతమైన కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని, ప్రజలందరినీ హృదయపూర్వంగా అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. పేదలు, రైతులు, ప్రజలు, మహిళలు గురించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా.. అద్భుతమైన పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు.ఇటీవల 26 రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది రైతు నాయకులు వచ్చి తనను కలిశారని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు.జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని సభలో ఉన్న జనాలను కేసీఆర్‌ ప్రశ్నించారు.
గుజరాత్‌ మోడల్‌ అని చెప్పి దగా..
గుజరాత్‌ మోడల్‌ అని చెప్పి దేశ ప్రజలను ఈ మోదీ దగా, మోసం చేశారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అడ్డగోలుగా ధరలు పెంచారు. స్మశానాల మీద పన్ను, పాలమీద జీఎస్టీ, చేనేత మీద జీఎస్టీ, పేద ప్రజలు ఉసురుపోసుకుంటూ.. లక్షల రూపాయాలు మేస్తూ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు స్వయంగా చూస్తున్నాం. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేశామని చెప్తారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కల్తీ మద్యానికి 79 మంది బలయ్యారు. అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీని మీ సమాధానం ఏంటని అడుగుతున్నాను అని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img