Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మేడారం జాతరకు పోలీసు శాఖ సిద్ధం

ములుగు ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ తెలిపారు. జాతరకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. జాతరకు సుమారు కోటి నుంచి కోటి 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.జాతరకు తరలి వచ్చే భక్తుల వాహనాలు, నాలుగు వేల ఆర్టీసీ బస్సులు పార్కింగ్‌ చేయడానికి పార్కింగ్‌ స్థలాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.జాతర సందర్భంగా సుమారు 10 వేల మంది పోలీస్‌ సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌ సమస్య లేకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తామన్నారు. 382 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్‌ కెమెరాలు, 20 డిస్ప్లే ప్యానెళ్లను ఏర్పాటుచేశామని, వాటిని కమాండ్‌ కంట్రోల్‌కి అనుసంధానించామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని,, తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img