Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గి, సాధారణ ప్రసవాలు పెరగాల్సిన అవసరం ఉంది

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గి, సాధారణ ప్రసవాలు పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆరోగ్య రంగాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జగిత్యాల పట్టణంలో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, రవి శంకర్‌, విద్యా సాగర్‌ రావు, టీఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, డీఎంఇ రమేష్‌ రెడ్డి, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కంటే ముందు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో నిర్వహించిన జ్వర సర్వే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఆశా కార్యకర్తలు బాగా పని చేశారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు సార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు. 2014 లో రూ.1500 ఉంటే ఇప్పుడు రూ. 9750 ఇస్తున్నాం. ఆశా కార్యకర్తల జీతం గుజరాత్‌లో రూ. 4000, రాజస్థాన్‌లో రూ. 3000, మధ్య ప్రదేశ్‌లో రూ. 3000 మాత్రమే అని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img