Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హైదరాబాద్‌కు వర్ష సూచన

హైదరాబాద్‌ పై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని, రానున్న 48 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. మరోవైపు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాతావరణం రెండు రోజులుగా మళ్లీ వేడెక్కింది.
గాలిలో తేమ శాతం తగ్గిపోయి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుకాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గాలిలో తేమ 25 శాతంగా నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img