Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలి : షర్మిల

టీఆర్‌ఎస్‌ లీడర్‌ అరాచకాలకు నిండు కుటుంబం బలైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవపై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. . ఇలాంటి దుర్మార్గున్ని వదిలిపెట్టకూడదు. తన తండ్రి ఎమ్మెల్యే వనమా ప్రోద్బలంతోనే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడని ట్వీట్‌ చేశారు. అతడి భూకబ్జాలు, సెటిల్‌ మెంట్లతో ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. ఇలాంటి నీచుడికి వెంటనే ఉరి శిక్ష వేయాలి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలి. రాజకీయాల నుంచి వెంటనే తప్పుకోవాలంటూ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img